Articles



ఖుర్ఆన్ మరియు సున్నతులపై కొన్ని ప్రశ్నోత్తరాలు





] తెలుగు – Telugu –تلغو [





islamhouse.com





2012 - 1433





أسئلة وشبهات عن القرآن الكريم والسنة النبوية





« باللغة تلغو »





موقع دار الإسلام





2012 - 1433





ఖుర్ఆన్ మరియు సున్నతులపై కొన్ని ప్రశ్నోత్తరాలు





1. ముస్లింలు ఖుర్ఆన్ అంటే ఏమిటి ?





ఖుర్ఆన్ అంటే జిబ్రయీల్ దైవదూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ అవతరింపజేసిన అసలు సిసలైన, ఖచ్చితమైన దివ్యవచనాల సంకలన గ్రంథం. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కంఠస్థం చేయబడింది. తర్వాత ఆయన దానిని తన సహచరులకు వినిపించి, కొందరిని జ్ఞాపకం చేయని, మరికొందరిని లిఖించమని ఆదేశించారు. ఆయన జీవితకాలంలోనే మొత్తం ఖుర్ఆన్ దివ్యవచనాలు సరిచూడబడినాయి, పరస్పరం పరీక్షణం చేయబడినాయి. గడిచిన 14 శతాబ్దాలుగా ఖుర్ఆన్ లోని 114 అధ్యాయములలో (సూరాలు) ఒక్క అక్షరం కూడా మార్చబడలేదు. కాబట్టి, ఖుర్ఆన్ గ్రంథం 14 శతాబ్దాలకు పూర్వం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింప జేయబడినప్పటి నుండి నేటి వరకూ ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా, స్వచ్ఛమైన రూపంలో మిగిలి ఉన్న ఏకైక, అద్వితీయ, అపూర్వ, అసమాన మరియు అద్భుత గ్రంథం అని ప్రతి కోణంలో ఋజువు అయింది.





2. ఖుర్ఆన్ గ్రంథంలో ఏముంది ?





అల్లాహ్ యొక్క అంతిమ దివ్యావతరణ వచనమైన ఖుర్ఆన్ మే ప్రతి ముస్లిం విశ్వాసాలకు జన్మస్థానం మరియు ఆచరణలకు మూలాధారం. వివేకం, సిద్ధాంతం, ఆరాధన, చట్టం మొదలైన మనుష్య సంబంధమైన విషయాలన్నింటినీ ఖుర్ఆన్ సంబోధిస్తున్నా దాని అసలు విషయం సృష్టికర్తకు మరియు ఆయన యొక్క సృషికి మధ్య ఉండవలసిన సంబంధాన్నే స్పష్టంగా బోధిస్తున్నది. అదే సమయంలో అది ఒక న్యాయమైన, నిష్పాక్షికమైన, ధర్మబద్ధమైన సామాజిక మరియు అర్థిక వ్యవస్థల నిర్మాణం, సరైన మానవ స్వభావం కొరకు అవసరమయ్యే ఖచ్చితమైన సన్మార్గాన్ని చూపుతున్నది.





3. మరింకేమైనా పవిత్ర మూలగ్రంథాలు ఉన్నాయా?





అవును, ఉన్నాయి. అదే సున్నతులు / హదీథులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు మరియు ఉపమానాలు. ఇవి ముస్లింల కొరకు రెండో ప్రామాణిక మూలాధారం. హదీథు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు, ఆచరణలు మరియు అనుమతులు. సున్నతును నమ్మడమనేది ఇస్లామీయ విశ్వాసంలో ఒక ముఖ్యభాగం.





4. ఖుర్ఆన్ లో 25 మంది ప్రవక్తల పేర్లు పేర్కొనబడినట్లు చెప్పబడింది. మరి ఆ పేర్లు ఏవి?





ఖుర్ఆన్ లో పేర్కొనబడిన ప్రవక్తల పేర్లు:





ఆదం; ఇద్రీస్; నూహ్; హూద్; సాలెహ్; ఇబ్రాహీం; లూత్; ఇస్మాయీల్; ఇస్హాక్; యూఖూబ్; యూసుఫ్; అయ్యూబ్; షుయైబ్; మూసా; హారూన్; ఉజైర్; దాఊద్; సులైమాన్; ఇల్యాస్; దుల్ కిఫిల్; యూనుస్; జకరియ్యా; యహ్యా (John the Baptist); జీసస్ మరియు ముహమ్మద్ – ప్రవక్తలందరిపై అల్లాహ్ యొక్క శాంతి కురుయుగాక.





Recent Posts

Таҳия ва баргардон М ...

Таҳия ва баргардон Мусъаби Ҳамза

Шиъаҳои имомия ва мас ...

Шиъаҳои имомия ва масъалаи такфир

Ҳадиси «Ман шаҳри илм ...

Ҳадиси «Ман шаҳри илм ҳастам ва Алӣ дари он аст»‎